పంట కాలువలో పడి వృద్ధుడు మృతి | Sakshi
Sakshi News home page

పంట కాలువలో పడి వృద్ధుడు మృతి

Published Tue, Dec 5 2023 5:20 AM

మృతి చెందిన పోలయ్య  - Sakshi

కారంచేడు: భార్య మరణాన్ని తట్టుకోలేక మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయాడు ఓ వృద్ధుడు. కారంచేడు ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. కారంచేడు కాలువ సెంటర్‌ యానాది కాలనీ ప్రాంతంలో నివసించే పొట్లూరి అంకయ్య (65) చేలల్లో ఎలుకలు పట్టుకొని జీవనం సాగించేవాడు. అప్పుడప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేసేవాడు. ఈక్రమంలో గతేడాది భార్య మరణించింది. అప్పటినుంచి అంకయ్య మద్యానికి అలవాటు పడ్డాడు. ఆదివారం మద్యం పూటుగా తాగి తూలుతూ కనిపించాడు. ఇది మామూలే అని స్థానికులు పట్టించుకోలేదు. ఒంటరిగానే జీవించే పోలయ్య రాత్రి కారంచేడు–కుంలమర్రు రోడ్డులోని దొంగ తూముల సమీపంలో ఉన్న పంట కాలువ వైపు వెళ్లాడు. రోడ్డుకు ఆనుకొనే ఉన్న పంట కాలువలో కాలు జారి పడి మృతి చెందాడు. ఉదయం పొలాలకు వెళ్లే రైతులు గమనించి విషయాన్ని కాలనీ వాసులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని స్థానికుల సహకారంతో మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నప్పటికీ వారికి వివాహాలు కావడంతో వేరే కాపురాలు ఉంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

భార్య మరణంతో మద్యానికి బానిస మత్తులోనే ప్రాణాలు ఒదిలిన వృద్ధుడు

Advertisement
Advertisement