సంక్షేమ పథకాల అమలుకు మళ్లీ జగనే రావాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల అమలుకు మళ్లీ జగనే రావాలి

Nov 21 2023 2:14 AM | Updated on Nov 21 2023 2:14 AM

మాట్లాడుతున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి - Sakshi

మాట్లాడుతున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి

పిట్టలవానిపాలెం: కులాలు, మతాలు, పార్టీలక తీతంగా అనేక సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించినందుకే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. పిట్టలవానిపాలెం మండల మంతెనవారిపాలెం గ్రామ సచివాలయ పరిధిలో సోమవారం ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ ఉయ్యూరి లీలాశ్రీనివాసరెడ్డి ఽఅధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్‌లు ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేశారు కాబట్టే మరలా జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు. పేద పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలని నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి తెచ్చారని, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో ఇంటింటికీ వైద్యసేవలు అందించినందుకే జగనన్న రాష్ట్రానికి అవసరమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 98 శాతం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేశారని అన్నారు. గుండెమీద చెయ్యి వేసుకుని ఓటు అడిగే హక్కు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తకే ఉందన్నారు. నవరత్నాల పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు నర్రా శ్రీనివాసరావు, బోరుగడ్డ ఆదాం, ఎంపీటీసీ సభ్యురాలు రాహేలు, బాపట్ల ఏఎంసీ డైరెక్టర్‌ తూనుగుంట్ల శ్రీనివాసరావు, కొర్లపాటి రాజేష్‌, వైస్‌ ఎంపీపీ చేబ్రోలు కృపానందం, బొలగాని సుబ్బారావు, కుంఠం ప్రసన్నరాజు, వాలి శివారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు మండే విజయ్‌కుమార్‌, బడుగు ప్రకాశరావు, దోమ తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చిన జగనే మళ్లీ సీఎం కావాలి

సమ్మెటవారిపాలెం(కర్లపాలెం): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారని, ఆయనే తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. సమ్మెటవారిపాలెంలో సోమవారం జరిగిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోన రఘుపతి హాజరయ్యారు. వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ సచివాలయంలో సంక్షేమ పథకాల ఫ్లెక్సీలు ఆవిష్కరించి అక్కడ జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పిట్టు నాగార్జునరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, ఏఎంసీ చైర్మన్‌ దొంతిబోయిన సీతారామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాల్‌రెడ్డి, గ్రామ సచివాలయాల మండల కన్వీనర్‌ సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు కాగిత బుల్లియ్య, మరకా పెద వెంకటేశ్వర్లు, ఆట్ల నాగేశ్వరరెడ్డి, శీలం వీరారెడ్డి, మార్పు బెనర్జి, ఆట్ల నాగిరెడ్డి, పిట్టు నాగరాజురెడ్డి, ధర్మేంద్ర, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కోన రఘుపతి మంతెనవారిపాలెంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement