Weekly Horoscope: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు, వారం చివరలో ధనలాభం

Weekly Horoscope Telugu 25-09-2022 To 01-10-2022 - Sakshi

వారఫలాలు..

మేషం.. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.  ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం.. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. పదిమందినీ ఆకట్టుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం.. ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సంఘంలోగౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. పసుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో ధనలబ్ధి. కొత్త ఒప్పందాలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం.. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, తెలుపు రంగులు. దక్షిణాది  ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కన్య.. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

తుల.. నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం.. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ప్రముఖులు పరిచయమవుతారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు.. కొన్ని పనులు నెమ్మదించినా సకాలంలోనే పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. పరపతి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు దక్కవచ్చు. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో  సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధువుల ద్వారా సహాయం అందుకుంటారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

కుంభం.. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. నీలం, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం.. ఉత్సాహంగా ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. అత్యంత రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో కదలికలు. పోటీపరీక్షల్లో విజయం.  తీర్థయాత్రలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top