Weekly Horoscope: ఈ రాశులవారికి వారం మధ్యలో శుభవార్తలు.. ధనలాభం

Weekly Horoscope Telugu 06-11-2022 To 12-11-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనులలో  విజయం. ఆస్తుల కొనుగోలు యత్నాలు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. వివాదాలు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో  ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.  రాజకీయవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు.  వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో వివాదాలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆలోచనలు కలసివస్తాయి. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు. భూములు, భవనాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం  వారికి  విశేష గుర్తింపు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమ తప్పదు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి విషయంలో సమస్యలు తీరతాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.  వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.  వారం  మధ్యలో సోదరులతో వివాదాలు. శ్రమాధిక్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
రాబడి  ఆశించిన విధంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలలో అనుకూల సమయం. ఉద్యోగాలలో  ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకునికి అర్చనలు చేయండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.  విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది.  వ్యాపారాల విస్తరణయత్నాలు విజయవంతంగా సాగుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయ, పారిశ్రామివర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. తెలుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారరంగంలో పేరుప్రఖ్యాతులు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలు కాస్త ఊరట లభిస్తుంది.  వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. భూములు, భవనాలు కొంటారు. అనుకున్న విధంగా ఆర్థిక పరిస్థితి కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాల బాటలో పయనిస్తారు, భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.  రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. విద్యార్థులకు కొంత అనుకూల సమయం. కొత్త పెట్టుబడులతో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో  చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఆలోచనలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు  పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం ప్రారంభంలో  «దనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఇబ్బందులు తొలగుతాయి. భాగస్వాముల నుంచి  సహాయం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం. కళాకారులు, రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో మానసిక ఆందోళన. పసుపు, నేరేడు రంగులు. దక్షిణ దిశప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.  బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఇబ్బందికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. దైవచింతన. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు  ప్రారంభిస్తారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు కీలక సమాచారంరావచ్చు. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం. కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో వివాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top