ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Telugu Horoscope On May 3rd To May 9th 2026: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

May 3 2026 4:18 AM | Updated on May 3 2026 11:09 AM

Weekly Horoscope Telugu 03-05-2026 To 09-05-2026

మేషం... 
ముఖ్యమైన పనులు  నిదానంగా పూర్తి కాగలవు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. దాతృత్వాన్ని చాటుక్రÆుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారం. బాకీలు కొన్ని వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికరంగం వారి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.

వృషభం...
ఒక ముఖ్య∙సమాచారం అందుకుంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది. వాహనయోగం. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం  మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు.   కాలభైరవాష్టకం పఠించండి.

మిథునం....
కొత్త పనులు  ప్రారంభిస్తారు. బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి  మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగే సమయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి ఏర్పడి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాల వారు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఆదిత్యుని పూజించండి.

కర్కాటకం...
ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు.  కాంట్రాక్టులు అనూహ్యంగా  పొందుతారు. జీవిత భాగస్వామితో స్వలμ వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  వాహనాలు,  భూములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు.  వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో  కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాల వారు సంస్థల ఏరాμటుపై దృష్టి సారిస్తారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం...
అతి ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ పొందుతారు. కొన్ని సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కొంత చికాకులు . రావలసిన సొమ్ము అందుతుంది. బాకీలు తీరుస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని  ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. కొన్ని పదవులు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య......
ఆత్మీయులు సహాయసహకారాలు అందిస్తారు. వాహనాలు , భూములు కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగార్ధుల యత్నాలలో కొంత అనుకూలత ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు దక్కుతాయి.విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో  దుబారా ఖర్చులు. బంధువులతో తగాదాలు. పసుపు, బంగారు రంగులు. సత్యనారాయణస్వామికి అర్చన చేయించుకుంటే మంచిది.

తుల...
బాధ్యతలు మరింత పెరుగుతాయి. బంధువులతో లేనిపోని విభేదాలు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఇతరులనుంచి రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. వ్యాపారాలలో  నిదానం అవసరం. లాభాలు స్వల్పంగా ఉంటాయి.  ఉద్యోగాలలో పని పనిభారం మరింత పెరిగి సతమతమవుతారు. కళారంగం వారికి కాస్త నిరాశ తప్పదు. వారం మధ్యలో  శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, గులాబీ రంగులు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం...
పట్టుదలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆశయాలు సాధనలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆరోగ్యం కుదుటపడుతుంది. రావలసిన బకాయిలు అందుతాయి. చేతినిండా సొమ్ము ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు.  ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో స్వల్వ వివాదాలు. నీలం, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు...
పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. అంచనాలు నిజం కాగలవు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.  బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.  ఆకస్మిక ధనలాభం. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో  పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఒక కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మకరం....
మిత్రుల అన్ని విధాలా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనసౌఖ్యం. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారులకు విస్తరణయత్నాలలో విజయం. ఆశించిన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.

కుంభం...
ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న çవిధంగా  పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.  నిరుద్యోగుల కల ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి. అయితే కొంత భారం తప్పదు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. వారం చివరిలో కుటుంబసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం...
కార్యజయం. బంధువర్గం నుంచి శుభవర్తమానాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.  రావలసిన సొమ్ము అందుకుంటారు. రుణబా«ధల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహయత్నాలు సానుకూలమవుతాయి.  వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగంవారికి కొన్ని  అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.. వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. గణపతిని పూజించండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement