ఈ రాశి వారు శుభవార్తలు వింటారు, ధనలాభం

Today Horoscope 16 10 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.సప్తమి పూర్తి (24గంటలు) నక్షత్రం: ఆరుద్ర రా.1.47 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం: ఉ.8.36 నుండి 10.22 వరకు దుర్ముహూర్తం: సా.4.03 నుండి 4.48 వరకు అమృతఘడియలు: ప.2.46 నుండి 4.32 వరకు.

సూర్యోదయం        :  5.56
సూర్యాస్తమయం    :  5.36
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: ఆర్థికాభివృద్ధి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృషభం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. దైవచింతన. అనారోగ్య సూచనలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: సన్నిహితుల నుండి ధనలాభం. కొత్త మిత్రుల పరిచయం. కొన్ని వేడుకలకు హాజరవుతారు. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కర్కాటకం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

సింహం: ఆశ్చర్యకర సంఘటనలు. ప్రముఖులతో సమావేశం. పాతమిత్రుల కలయిక. ఆర్థిక ప్రగతి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది.

కన్య: రుణబాధలు తొలగుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ బాధ్యతలు నెరవేరుస్తారు.

తుల: కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని ప్రయాణాలు తప్పదు. బంధువులతో తగాదాలు.  శ్రమ వృథా కాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: ప్రయాణాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురుండదు.

మకరం: పనులు మరింత సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. ఆస్తులపై చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభం: రాబడి అంతగా లేక అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మీనం: రుణయత్నాలు సాగిస్తారు. అనుకున్న పనులు నిదానిస్తాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top