Today Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.అష్టమి ప.2.29 వరకు తదుపరి నవమి, నక్షత్రం: చిత్త ప.2.44 వరకు తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.8.11 నుండి 9.47 వరకు, తిరిగి రా.8.20 నుండి 9.55 వరకు, దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.55 వరకు వరకు, అమృతఘడియలు: ఉ.8.10 నుండి 9.43 వరకు, మకర ‡సంక్రాంతి.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: వ్యవహారాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల నుండి ధనలాభం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహాన్నిస్తాయి.
వృషభం: పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొంత అనుకూలత. ఆలయ దర్శనాలు.
మిథునం: ముఖ్య వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
కర్కాటకం: రుణఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. కొద్దిపాటి అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
సింహం: ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది.
కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
తుల: ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలపై ఎటూ తేలనిస్థితి. వ్యాపరాలు, ఉద్యోగాలలో చిక్కులు.
ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. పనులు సమయానికి పూర్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాల మేరకు నడుస్తాయి.
మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు కొంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
కుంభం: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
మీనం: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.
మరిన్ని వార్తలు :