ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి లాభం | Rasi Phalalu: Daily Horoscope On 30-06-2026 In Telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తి లాభం

Jun 30 2026 3:09 AM | Updated on Jun 30 2026 9:42 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-06-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.పాడ్యమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: పూర్వాషాఢ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.2.30 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 9.00 వరకు తదుపరి రా.10.57 నుండి 11.41 వరకు, అమృత ఘడియలు: రా1.05 నుండి 2.54 వరకు.

సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం...  కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.

వృషభం....  వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.

మిథునం....  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కర్కాటకం.... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం.... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.

కన్య... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.

తుల... శ్రమ ఫలిస్తుంది.  సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.

వృశ్చికం.. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు... అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.

మకరం...  ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.

కుంభం... కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం..... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తి లాభం. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement