
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.త్రయోదశి రా.11.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.8.52 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: రా.9.01 నుండి 10.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.07 వరకు,
అమృత ఘడియలు: ఉ.7.14 నుండి 8.50 వరకు.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.58
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... రుణదాతల నుంచి ఒత్తిడులు. పనుల్లో జాప్యం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.
వృషభం... కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు.
మిథునం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
సింహం.... సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కన్య... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఆస్తి విభేదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి
తుల.... పనులు చకచకా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృశ్చికం..... ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు. బాకీలు వసూలవుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
ధనుస్సు... పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
మకరం.... ఆస్తి వివాదాలు. పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.
కుంభం.. మిత్రులతో విభేదాలు పరిష్కారం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వస్తులాభాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
మీనం.... దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.