ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం | Rasi Phalalu: Daily Horoscope On 19-06-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం

Jun 19 2025 5:31 AM | Updated on Jun 19 2025 9:23 AM

Rasi Phalalu: Daily Horoscope On 19-06-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.అష్టమి ఉ.8.43 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.45 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.7.08 నుండి 8.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.43 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు, అమృతఘడియలు: సా.4.10 నుండి 5.38 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. 

మేషం... రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

వృషభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం.. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభవార్తలు. ఆస్తి లాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

కర్కాటకం.... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

సింహం.... ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అదనపు బా«ధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య.... ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

తుల... బంధువులతో సఖ్యత. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు. గృహ, వాహనయోగాలు.

వృశ్చికం.. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు.. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం... పనుల్లో విజయం. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.

కుంభం... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.

మీనం... శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement