
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.ఏకాదశి రా.1.17 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పునర్వసు ఉ.9.38 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.5.26 నుండి 7.00 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.19 వరకు, అమృత ఘడియలు: రా.2.46 నుండి 4.18 వరకు, మతత్రయ ఏకాదశి.
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.00
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం... పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
మిథునం... రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
సింహం.... మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
కన్య....... కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.
ధనుస్సు.. కుటుంబంలో సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
మకరం... కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం... పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.