గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: బ.తదియ రా.2.50 వరకు, తదుపరి చవితి; నక్షత్రం: అనూరాధ ఉ.8.04 వరకు, తదుపరి జ్యేష్ఠ; వర్జ్యం: ప.2.16 నుండి 4.03 వరకు; దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.12 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.44 వరకు; అమృత ఘడియలు: రా.12.56 నుండి 2.41 వరకు.
సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.16
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం..... కుటుంబంలో ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. బంధువర్గంతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
వృషభం.... విద్యార్థుల యత్నాలు సఫలం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
మిథునం..... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది.
కర్కాటకం.... వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలలో పొరపాట్లు.
సింహం.... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికం.
కన్య.... చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
తుల..... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
వృశ్చికం.... నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వాహనయోగం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
ధనుస్సు.... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
మకరం.... శుభకార్యాల రీత్యా ఖర్చులు. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. విందువినోదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కుంభం... కొత్త పనులు చేపడతారు. సోదరుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగలాభం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
మీనం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


