గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: బ.విదియ రా.12.48 వరకు, తదుపరి తదియ; నక్షత్రం: అనూరాధ పూర్తి (24 గంటలు); వర్జ్యం: ఉ.10.02 నుండి 11.46 వరకు; దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.24 వరకు; అమృత ఘడియలు: రా.8.36 నుండి 10.21 వరకు.
సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.15
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం..... ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.
వృషభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం.... కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభసూచనలు. ప్రముఖుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కర్కాటకం... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక డీలాపడతారు.
సింహం..... రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు.
కన్య.... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
తుల.... రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువుల నుంచి విమర్శలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
ధనుస్సు... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మకరం..... పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
కుంభం.. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వస్తులాభాలు.
మీనం.... శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.


