రాశి ఫలాలు: ఈ రాశివారికి పాతబాకీలు వసూలవుతాయి, మిగతా రాశులవారికి ఇలా..

Daily Horoscope: Today Horoscope 02 06 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, 
సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
తిథి: శు.త్రయోదశి ఉ.10.57 వరకు, తదుపరి చతుర్దశి, 
నక్షత్రం: విశాఖ తె.5.34 వరకు, తదుపరి అనూరాధ, 

వర్జ్యం: ఉ.10.58 నుండి 12.35 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.54 వరకు, తదుపరి ప.12.22 నుండి 3.50 వరకు, 
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

అమృతఘడియలు: రా.8.40 నుండి 10.16 వరకు.

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం..

వృషభం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు కాగలవు. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహం. 

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. ఆత్మీయుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 

సింహం: ఆధ్యాత్మిక చింతన. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విందువినోదాలు. 

కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. 

తుల: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం. విందువినోదాలు. 

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. బాకీలు వసూలవుతాయి. 

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

మీనం: పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top