13న నవోదయ ప్రవేశపరీక్ష
మదనపల్లె సిటీ: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షను 23 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.గీత తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 11.30 గంట నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ప్రవేశకార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు.
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న వారిని రాష్ర పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆవుల విష్ణువర్థన్‌రెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన పోలు సుబ్బారెడ్డి, ఉపేంద్రారెడ్డి, మదనపల్లెకు చెందిన డి. ఉదయ్ కుమార్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రఘునాథ్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గానికి చెందిన సంబటూరు ప్రసాద్‌రెడ్డిలను నియమించారు.
వాల్మీకిపురం: మహిళా సంఘాల్లోని సభ్యులు సైతం ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. మండలంలోని చింతపర్తి, అయ్యవారిపల్లి గ్రామాల్లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, ఐఎఫ్‌ఎస్ మోడల్స్, బయో రిసోర్స్ సెంటర్‌లను గురువారం పీడీ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఎఫ్‌పివో ద్వారా మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణ, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి టౌన్: పదవీ విరమణ చేసిన ఉద్యోగులు జనవరి నెల ఆఖరులోగా తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రభుత్వ ఉద్యోగుల (రిటైడ్) ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎంసి రెడ్డెన్న అన్నారు. గురువారం రాయచోటి ఖజానా కార్యాలయ అధికారి (డీటీవో)తో కలసి కో ఆర్డినేషన్ ( సమన్వయ) సమావేశం నిర్వహించినట్లు వీటిని సంబంధించిన వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఖజానా అధికారులతో కలసి పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు ఎన్. నరసింహులు, శివనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, కృత్రిమంగా యూరియా కొరతను సృష్టిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం పత్రికలకు అందజేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రబీ 2025–26కు గాను అన్ని పంటలకు అవసరమైన 18,071 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అన్నమయ్య జిల్లాకు 6124 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటికే 6250 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటులో ఉందన్నారు. డిసెంబర్ నెలాఖరుకు ఇంకా 1546 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఎరువుల కొరత లేదని కలెక్టర్ తెలిపారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లింపు చేసినా, ఎంఆర్‌పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా వారి లైసెన్సులు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
13న నవోదయ ప్రవేశపరీక్ష


