లక్ష్యం సకాలంలో పూర్తి చేయాలి
రాయచోటి: నిర్దేశించిన లక్ష్యాలను వైద్య సిబ్బంది సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎల్.రాధిక పేర్కొ న్నారు. బుధవారం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీటీసీ కేంద్రంలో జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఏఆర్‌టీ, ఐసీటీసీ ఎస్‌టీఐ, క్షయ వ్యాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితులను గుర్తించి వారిని ఏఆర్‌టీ కేంద్రాలలో నమోదు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ అధికారి వేంపల్లి భాస్కర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిన వారికి క్షయ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌ఓటీబీ కన్సల్టెంట్ డాక్టర్ టీఎస్ నితీష్ రామ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య, పీపీఎం ఆరోగ్య ప్రణిత్, క్లస్టర్ సూపర్ వైజర్ పీవీ ప్రసాద్, డీఎండీఒ సిలార్ సాహెబ్, క్లస్టర్ ప్రెవెన్షన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, టీబీ సిబ్బంది, స్వచ్చంద సంస్థల ప్రాజెక్టు మేనేజర్లు, ఎడబ్ల్యూఎస్ అల్లవల్లి తదితరులు పాల్గొన్నారు.


