ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడి
రామాపురం: ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ తెలిపారు. మండలంలోని నీలకంఠరావుపేట గ్రామం రైతుసేవా కేంద్రంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ మధుకర్ మాట్లాడుతూ నీలకంఠరావుపేట గ్రామాన్ని నేషనల్ మిషన్ ఫర్ నాచురల్ ఫామింగ్ కింద కొత్తగా తీసుకోవడం జరిగిందని, ఇక్కడ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వై.నాగమణి, సాంకేతిక వ్యవసాయ అధికారి నవంత్‌బాబు, పట్టుపరిశ్రమశాఖ సాంకేతిక అధికారి లక్ష్మి, శశికళ, రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.


