
రేపు శ్రీదేవరరాయి నల్లగంగమ్మ జాతర
సంబేపల్లె: భక్తుల కొంగు బంగారమైన శ్రీదేవరరాయి నల్లగంగమ్మ తల్లి జాతర ప్రతి ఏటా మొలకల పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సోమవారం ఉదయం నుంచి అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు జరుగుతాయని, రాత్రి జాతర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు. అమ్మవారిని పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం దర్శించుకుంటున్నారు.
మహా మండపం నిర్మాణం..
అప్పటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కృషితో ఆలయ మహామండపం నిర్మాణానికి రూ.1.18కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2022 ఫిబ్రవరి 4న మహామండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తికావడంతో ఆలయం సర్వాంగ సుందరంగా తయారైంది.గుడి ప్రాంగణంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు.
కార్యక్రమాల వివరాలు
సోమవారం ఉదయం 5 గంటలకు అభిషేకం, ప్రత్యేకపూజలు, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం. 12:30కి భక్తిగీతాల ఆలాపన, సాయంత్రం 6:30గంటలకు అమ్మవారి పల్లకీ సేవ, రాత్రి 7:30కి అన్నదాన కార్యక్రమం. రాత్రి 8:30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రేపు శ్రీదేవరరాయి నల్లగంగమ్మ జాతర