
రాజంపేట రూరల్: సమాజంలోని దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని ఆదుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందామని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ సూచించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో మంగళవారం టీబీ పేషెంట్లకు పోషకాహార పదార్థాల కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవన విధానాలను పాటించాలన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని దాదాపు 100 మంది టీబీ పేషెంట్లను 6 నెలల పాటు దత్తత తీసుకున్నామన్నారు. సబ్ కలెక్టర్ అహమ్మద్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, డీఎంహెచ్‌ఓ కొండయ్య, అడిషనల్ డీఎంహెచ్‌ఓ శైలజ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎస్.చిన్నికృష్ణ, రోటరీక్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వంకన గురుప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి పి.జనార్దనరెడ్డి, ట్రెజరర్ మిరియం శ్రీనివాసయాదవ్, మాజీ అధ్యక్షుడు ఓవీ శివారెడ్డి పాల్గొన్నారు.