
పశువులపై దాడికి చేయడానికి చిరుత వచ్చిన దారిని చూపుతున్న రైతులు, చిరుత పాద ముద్రలు
రైల్వేకోడూరు రూరల్ : మండల పరిధిలోని చియ్యవరం వడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చియ్యవరం వడ్డిపల్లె రైతుల తోటల్లో ఉన్న మూడు పశువుల దొడ్ల వద్ద మూడు రోజులుగా రాత్రిళ్లు చిరుత వస్తోందని, తామంతా కాపలా ఉండి తరిమితే పక్కనే ఉన్న ఏటిలోకి వెళుతోందని పాడి రైతులు వాపోతున్నారు. సోమవారం రాత్రి కూడా వచ్చిందని రైతులు అంటున్నారు. రాత్రుళ్లు పంటలకు నీరు పెట్టేందుకు కూడా ఇబ్బందిగా ఉందని వారు వాపోతున్నారు. సమాచారం బయటికి రావడంతో చుట్టపక్కల గ్రామాల ప్రజలు కూడా బెంబేలెత్తుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని రైతులకు, ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని వారు వేడుకుంటున్నారు.
