
నగదు లెక్కిస్తున్న అధికారులు, సిబ్బంది
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఆలయ, బ్యాంక్ అధికారులు, పాలక మండలి సభ్యులు విద్యార్థులతో కలిసి లెక్కింపు చేపట్టారు. హుండీల ద్వారా రూ.32,51,090 వచ్చింది. నిత్యాన్నదానం కోసం ఏర్పాటు చేసిన హుండీ ద్వారా రూ.54,155 సమకూరింది. స్వామి, అమ్మవారికి భక్తులు 73 గ్రాముల బంగారు, 2.420 కిలోల ఆభరణాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయ, ఈవో డీవీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలంరెడ్డి దశరథరామిరెడ్డి, పాలక మండలి సభ్యులు నాగభూషణ్, రత్నశేఖర్‌రెడ్డి, సురేష్‌కుమార్, పి.భాస్కర్, నరసింహులు, జిల్లా దేవదాయశాఖ పర్యవేక్షణ అధికారి జనార్ధన్, సాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పల్లకీలో ఊరేగింపు : రాయచోటిలో భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని రాత్రి పల్లకీలో ఊరేగించారు. వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి రంగు రంగు పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. స్థానిక భక్తులతోపాటు కన్నడిగులు పాల్గొన్నారు.