మదనపల్లె : భర్త వేధింపులపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలోని రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన గోపాల కృష్ణారెడ్డి, కళావతి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గోపాలకృష్ణారెడ్డి ఇటీవల ఎక్కువగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు కళావతి పేరుపై ఉన్న స్థలం అమ్మి డబ్బు ఇవ్వాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.
ఈ విషయమై కొద్దిరోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె సోమవారం భర్త వేధింపులపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.