
రెడ్డివారికుంటలో షెడ్ వేసిన దృశ్యం
ఓబులవారిపల్లె : మండలంలోని పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని రెడ్డివారికుంటను దర్జాగా కబ్జా చేస్తున్నారు. దీనిని అరికట్టాలని పెద్దఓరంపాడు గ్రామ రైతులు సోమవారం రాయచోటిలో కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. కుంటలో కొంత మంది కట్టడాలు కట్టి, ప్లాట్‌లుగా చదును చేసి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. గ్రామంలోని పశువులు నీరు తాగడానికి, ఇతర అవసరాలకు కుంటలోని నీరు ఉపయోగ పడుతుందన్నారు. కావున ఆక్రమణలను తొలగించాలని కోరారు.
కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు