
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు
రాయచోటి : స్పందన బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్దన్ రాజు సూచించారు. సోమవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదేపదే పోలీసు స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండకూడదన్నారు. పోలీస్ అధికారులే స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి విచారించి సకాలంలో చట్టపరిధిలో న్యాయం చేయాలన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలతో 63 మంది ఫిర్యాదుదారులు జిల్లా ఎస్పీని కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు