పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

మృతురాలి కుటుంబ సభ్యులనుంచి 
కార్నియాలను సేకరిస్తున్న నేత్రనిధి సిబ్బంది - Sakshi

– జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హుస్సేన్‌

లక్కిరెడ్డిపల్లి : ఏప్రిల్‌ నెలలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హుస్సేన్‌ పేర్కొన్నారు. సోమవారం లక్కిరెడ్డిపల్లిలోని ఎస్సీ వన్‌, టు బాలుర వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం పిల్లలకు భోజనం వడ్డించాలని సూచించారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తే సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చదివే విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ, ఇంటర్మీడియట్‌లో మంచి కళాశాలలో సీటు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూ శ్రీనివాసులు, రమేష్‌, సూర్యకాంతమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

నేషనల్‌ యూత్‌ వలంటీర్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

వైవీయూ : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువకేంద్రం పరిధిలో నేషనల్‌ యూత్‌ వలంటీర్‌గా పనిచేసేందుకు ఆసక్తి గల యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ యువకేంద్రం కో–ఆర్డినేటర్‌ కె. మణికంఠం కోరారు. దరఖాస్తులను ఏప్రిల్‌ 3వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని సూచించారు. పదోతరగతి పాసై, 18 నుంచి 29 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఉద్యోగం చేస్తున్నవారు, చదువుతున్న వారు ఇందుకు అనర్హులు అన్నారు. ఇది కేవలం స్వచ్ఛంద సేవమాత్రమే, ఉద్యోగం కాదని పేర్కొన్నారు. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారు ఎన్‌వైకేఎస్‌.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికలు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు కడప నగరం బాలాజీనగర్‌లోని యూత్‌హాస్టల్‌లో, 08562–356303, 9533044233 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మహిళ నేత్రదానంతో

ఇద్దరికి చూపు

పులివెందుల రూరల్‌ : మహిళ నేత్రదానం చేయడంతో ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించిందని నేత్రనిధి అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురానికి చెందిన గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరిస్తూ నేత్రనిధి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందించారు. దీంతో రాజు సిబ్బందితో కలిసి మృతురాలి స్వగృహానికి వెళ్లి గంగమ్మ మృతదేహం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్‌ అగర్వాల్‌ నేత్రనిధికి పంపించారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top