
కొద్దేవర బొట్టు కార్యక్రమం మొరుసు కాపుల్లో విడదీయరాని బంధంగా వస్తోంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులోను కొనసాగుతుందన్న నమ్మకం ఉంది. తరాలుగా ఇది ఆచారంగా వస్తోంది. దేశంలో ఎక్కడున్నా ఇళ్లకు వస్తారు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నా. దీని కోసం సంతోషంగా వచ్చా. ఈ దేవరతో దాయాదులు, బంధుమిత్రులు అందరూ ఒక చోట కలవడం, యోగక్షేమాలు మాట్లాడుకుంటారు. ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి. పరోక్షంగా వారిలోని ఐకమత్యానికి నిదర్శనంగా కూడా నిలుస్తోంది – ఆర్.జానకి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని,
తూగువారిపల్లె, కురబలకోట మండలం