
మీడియాతో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ
● మందకృష్ణ మాదిగ డిమాండ్
కడప కోటిరెడ్డిసర్కిల్: పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చెన్న మృతికి కారకులను కఠినంగా శిక్షించడంతో పాటు మృతుని కుటుంబానికి రూ. కోటి పరిహారం అందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆయన జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అచ్చెన్న హత్యకు కారకులైన వారు ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా శిక్షించాలన్నారు. ఈ హత్యకు సంబంధించి కొంతమంది ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్ష పాత్ర పోషించారని తెలుస్తోందన్నారు. ఉన్నత స్థాయి అధికారినే హత్య చేస్తే ఇక సామాన్య దళిత వర్గాలకు రక్షణ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానితులందరిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ సంఘటనపై సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీని కూడా కలవనున్నట్లు ఆయన వివరించారు.