
ఐక్యత చాటుతున్న దళిత నేతలు
రాజంపేట : దళితులు ఐకమత్యంతో ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు దళితనేతలు తెలిపారు. ఆదివారం ఎస్సార్ కల్యాణ మండపంలో మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఉభయ జిల్లాల దళితుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ గౌరవ అధ్యక్షుడు యమాల సుదర్శన్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జగడం సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంసంజీవ్, గల్ఫ్ రాయలసీమ అసోసియేషన్ అధినేత దుగ్గి గంగాధరం, మాలమహానాడు గాలిశెట్టి సుధాకర్, నాగిరెడ్డిపల్లె అర్బన్ సర్పంచి జంబుసూర్యనారాయణ, దళిత ఐక్యవేదక రాష్ట్రనాయకుడు ఆర్ముగం విశ్వనాఽథ్, ఏపీజీబీ మాజీ మేనేజరు పిల్లి చంద్రశేఖర్, ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు పెనుబాల నాగసుబ్బయ్య మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో దళితులు సత్తా చాటాలన్నారు. దళితుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా మాలల జేఏసీ పని చేస్తుందని స్పష్టం చేశారు.
అంబేడ్కర్‌కు నివాళి
పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దళిత నాయకులు కాకిచంద్ర, పాపయ్య, చంద్రమౌళి, కొండాపురం మనోహర్‌బాబు, దాసరి పెంచలయ్య, మోడపోతుల రాము, బియ్యాల రమణ, అన్నమయ్య జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు శివయ్య, రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నరేష్, జైభారత్ రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, మాలమహానాడు నాయకులు బండేపల్లె రమణయ్య, సీపీఎం దళిత నాయకుడు పందికాళ్ల సుబ్రమణ్యం, ఓబిలి పెంచలయ్య, చిత్తూరు, తిరపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలకు చెందిన మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.