
ధ్వంసం చేసిన ఫెన్సింగ్ రాళ్లను చూపుతున్న పెంచలయ్య
రైల్వేకోడూరు : తెలుగుదేశం నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. వారి ఆగడాలు భరించలేక బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గురువారం కోడూరు పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గుండాల పెంచలయ్య అనే వ్యక్తి చియ్యవరం కమ్మపల్లి సమీపంలోని సర్వేనంబర్ 369–3లో ఉన్న తన పొలంలో నాటిన ఫెన్సింగ్ రాళ్లను టీడీపీకి చెందిన కొందరు ధ్వంసం చేసినట్టు సీఐ విశ్వనాథ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. 1980 సంవత్సరంలో తన తండ్రి చిన్న చెంగయ్య పేరుతో ప్రభుత్వం పట్టా ఇచ్చిందని పెంచలయ్య పేర్కొన్నారు. నాటినుంచి తమ ఆధీనంలో ఉన్న పొలంలో వారంరోజుల క్రితం ఫెన్సింగ్‌రాల్లు నాటించామన్నారు. అయితే చియ్యవరం కమ్మపల్లికి చెందిన యేదోటి నారాయణ, యేదోటి హరినాథ్, గడికోట చంద్రయ్యలు బుధవారం రాత్రి కొంతమంది మనుషులతో కలిసి ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేశారన్నారు. దీంతో రూ. 2లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. గతంతోనూ పొలంలో పనులను వీరు అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సీఐ విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసినవారు ఎవరనేది విచారిస్తామని, బాధితుడికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
పొలంలో ఫెన్సింగ్‌రాళ్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు