
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలులో పర్యటించనున్నారు.
బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలు చేరుకుని అక్కడ జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి కుమార్తె వివాహరిసెప్షన్కు హాజరుకానున్నారు.
