సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ని కలిశారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగా రాజ్‌భవన్‌కు సతీసమేతంగా వెళ్లిన సీఎం జగన్ దంపతులు గవర్నర్‌తో సమావేశమయ్యారు.

ముగిసిన భేటీ..
గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై గవర్నర్‌తో దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు సీఎం జగన్. గవర్నర్ భార్య సుప్రవాహరిచందన్‌ని సీఎం సతీమణి వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం సీఎం దంపతులు రాజ్ భవన్ నుంచి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. 


చదవండి: తల్లులకు టీకా.. చకచకా

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
