శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి

Telangana Genco Power Generation At Srisailam Left Bank Center - Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా: కేఆర్ఎంబీ ఆదేశాలను పట్టించుకోక పోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తోంది. శ్రీశైలంలో 835 అడుగుల నీటిమట్టం ఉంటేనే విద్యుదుత్పత్తి చేయాలని.. ఎడమగట్టులో 810 అడుగులకే తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని ఎస్‌ఈ వెంకటరమణయ్య అన్నారు.

శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్ నుంచి నీరు దిగువకు విడుదలవుతుందని.. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందన్నారు. ‘‘నిబంధనలు పాటించకుంటే పోతిరెడ్డిపాడు నుంచి విడుదలయ్యే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగునీటి సమస్య వస్తుందని ఎస్‌ఈ అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top