
సాక్షి,విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది.
దీంతో 840 బార్లలో 72 బార్లకే అప్లికేషన్లు వచ్చాయి. అయితే వీటిల్లో 45 బార్లకు మాత్రమే లాటరీకి అవసరమైన దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ స్కెచ్ వేసింది. దరఖాస్తులు వేయకుండా టీడీపీ నేతల సిండికేట్ చక్రం తిప్పింది. కమిషన్ భారీగా పెంచుకుని బార్లను దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. రేపటితో బార్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండగా.. 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు దాఖలు కాకపోవడం చర్చాంశనీయంగా మారింది.