తల్లికి పిండం పెడుతూ.. కుప్పకూలిన కొడుకు | Son Deceased At Mother Fetus Program In West Godavari | Sakshi
Sakshi News home page

మృతదేహానికి కోవిడ్‌ టెస్ట్‌.. పాజిటివ్‌

Jul 26 2020 8:38 AM | Updated on Jul 26 2020 8:43 AM

Son Deceased At Mother Fetus Program In West Godavari - Sakshi

సాక్షి, ఇరగవరం: తల్లికి పిండం పెడుతూ కుమారుడు కరోనాతో మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై జానా సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్‌ తల్లి 11 రోజుల క్రితం మృతి చెందింది. శనివారం వారి బంధువులు, కుమారుడు తల్లికి పిండం కార్యక్రమం ఉంది. అందులో భాగంగా పిండం పెడుతూనే శ్రీనివాస్‌ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెండాడు. వెంటనే బంధువులు వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహానికి కోవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామస్తులు ఎవ్వరూ మృతదేహాన్ని దహనం చేయడానికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు నలుగురు గ్లౌజ్‌లు ధరించి మాస్కులు పెట్టుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement