ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి
సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ వచ్చేనెల 4కు వాయిదా
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 28న (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ర్యాలీని నవంబరు 4వ తేదీకి వాయిదా వేశామని ఆయన తెలిపారు.
అలాగే, తుపాను నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.


