PV Sindhu Meets Andhra Pradesh CM YS Jagan at Tadepalli - Sakshi
Sakshi News home page

CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని

Aug 25 2022 5:46 PM | Updated on Aug 25 2022 6:56 PM

PV Sindhu Meets Andhra Pradesh CM YS Jagan at Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన సింధు బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని  సీఎం జగన్‌ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement