సీఎం జగన్‌కు ప్రధాని మోదీ బర్త్‌ డే విషెస్‌ | Pm Modi Wishes Cm Jagan On His Birthday | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపిన ప్రధాని మోదీ

Dec 21 2023 10:01 AM | Updated on Dec 19 2024 3:32 PM

Pm Modi Wishes Cm Jagan On His Birthday

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు 

సీఎం జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైఎ­స్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ  చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 

 


గవర్నర్‌ శుభాకాంక్షలు.. 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement