
చంద్రబాబు అరెస్ట్ తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు అరెస్ట్ తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నన్నేం చేస్తారు.. ఏం పీకుతారంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశారని ఈ కేసు చూస్తే అర్థమవుతోందన్నారు.
‘‘సీమెన్ సంస్థకు కూడా బాబు చేసిన అక్రమాలు తెలియదు. రూ.250 కోట్లకు పైగా షెల్ కంపెనీ ద్వారా పక్కదారి పట్టినట్టు కనిపిస్తుంది. ఆధారాలు ఉన్నాక కేసు పెడితే తప్పేంటి?. అక్రమ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్పదు. చంద్రబాబు తక్కువ మనిషేం కాదు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో దిట్ట. బాబు దగ్గర ఉన్న వాదన చెప్పాలి గానీ, రాజకీయ కుట్ర అని ఎలా అంటారు’’ అని కొమ్మినేని ప్రశ్నించారు.
దత్తపుత్రుడు మాటలు కూడా బాబుకు వత్తాసు పలికినట్లు ఉంది. ఇప్పటి వరకు కేసు విషయం పవన్ మాట్లాడలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఈడీ స్పందించింది. దానిపై దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారు. సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్లింది. చట్టానికి ఎవరు అతీతులు కాదు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అర్థమవుతోంది. ఏపీలో చట్టం పకడ్బందీగా అమలు అవుతోంది’’ అని కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
చదవండి: CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి..