
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: పాత గుంటూరు పోలీసుస్టేషన్‌పై దాడి కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలో యువతపై నమోదైన కేసులను వెనక్కు తీసుకుంటూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల్లో నిందితులైన వారిపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా.. 2018లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడికి సంబంధించిన అధికారులు అప్పట్లో ఆరు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. (అర్ధరాత్రి ఉద్రిక్తత.. పాత గుంటూరులో 144 సెక్షన్)