బాలికల ఎన్‌రోల్‌మెంటే ఎక్కువ | Enrolment of girls in primary schools rises in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాలికల ఎన్‌రోల్‌మెంటే ఎక్కువ

May 3 2026 4:36 AM | Updated on May 3 2026 4:36 AM

Enrolment of girls in primary schools rises in Andhra Pradesh

జాతీయ స్థాయిలో మూడేళ్లుగా ఇదే ట్రెండ్‌ 

దేశంలో మహిళలు–పురుషులు– 2025 నివేదిక వెల్లడి        

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో అన్ని స్థాయిల్లో బాలికల స్థూల నమోదు (ఎన్‌రోల్‌మెంట్‌) నిష్పత్తి ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో మూడేళ్లుగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మహిళలు–పురుషులు–2025 నివేదిక వెల్లడించింది.

జాతీయ స్థాయిలో మూడేళ్లుగా పునాది స్థాయిలో బాలురు, బాలికల స్థూల నమోదు నిష్పత్తి తక్కువగా ఉండగా ప్రాథమిక, మధ్య, ద్వితీయ స్థాయిల్లో బాలురు కన్నా బాలికల స్థూల నమోదు అత్యధికంగా నమోదు అవుతోందని నివేదిక స్పష్టం చేసింది. పునాది స్థాయి మినహా మిగతా స్థాయిల్లో ప్రాథమిక విద్యలో బాలురు కన్నా బాలికల స్థూల నమోదు మూడేళ్లుగా ఎక్కువగా ఉండటం విశేషం.   

Advertisement
 
Advertisement
Advertisement