
గుంటూరు (ఈస్ట్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూనియర్ లైన్‌మేన్ గ్రేడ్–2 ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించారని సీపీడీసీఎల్ సీఎండీ పద్మజనార్దనరెడ్డి అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో జూనియర్ లైన్‌మేన్ గ్రేడ్–2 ఉద్యోగుల సర్వీస్ రెగ్యులర్ కావడంతో వారంతా సీఎం జగన్ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన సీఎండీ పద్మజనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చలవ వల్ల జూనియర్ లైన్‌మేన్ గ్రేడ్–2 సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి వచ్చారన్నారు. వారికి వంద శాతం జీతాలు పెంచారని, ఏ ప్రభుత్వంలోనూ ఈ విధంగా జరగలేదని వివరించారు. మేయర్ కావటి శివనాగమనోహర్‌నాయుడు, సీపీడీసీఎల్ డైరెక్టర్ వి.జయభారతరావు, ఎస్‌ఈ మురళీకృష్ణ యాదవ్, ఈఈలు శ్రీనివాసబాబు, శ్రీనివాసరావు, హరిబాబు, ఏడీఈ ఖాన్ పాల్గొన్నారు.