
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారానికి రికవరీ రేటు 85.29 శాతానికి చేరింది. 24 గంటల్లో 74,710 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 8,096 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 49,59,081 పరీక్షలు నిర్వహించగా 6,09,558 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5,19,891 మంది కోవిడ్ బారినుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 84,423 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 67 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,244కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా మిలియన్ జనాభాకు 92,867 టెస్టులు చేస్తున్నారు.