గవర్నర్‌కు సీఎం జగన్ బర్త్‌డే విషెస్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా గవర్నర్‌కు ఫోన్ చేసి సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నానంటూ ఆయనకు సీఎం విషెస్ తెలిపారు. అదేవిధంగా రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సీఎం జగన్.. రాఖీ పండుగ సందర్భంగా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టన సంగతి తెలిసిందే. చదవండి: అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి