సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్‌

CM Jagan Orders To Release Sirivennela Sitarama Sastry Medical Bill From CMRF - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్‌ 24న సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల మృతి చెందారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 
(చదవండి: సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి)

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 
(చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు)

ఇటువంటి సమయంలో సీఎం జగన్‌ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top