అమరావతి దేవతల రాజధాని అందుకే కొందరికి నచ్చలేదు
టీడీపీ ఆవిర్భావ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను అమలుచేయలేరని అనుకున్నారని.. కానీ, తాను చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు.
21 నెలల్లో కొత్తగా ఐదు లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారుచేశామన్నారు. ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని తమ విధానమని.. త్వరలో అమరావతి రాజధానిపై కేంద్రం చట్టం చేస్తుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కావడంవల్లే కొందరికి నచ్చలేదని విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రధాని మోదీని తీసుకొచ్చి ప్రారంబోత్సవం చేస్తామన్నారు.
నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలి
పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలని, లేకపోతే వారికి పార్టీలో స్థానం ఉండదని.. భవిష్యత్తులో బాగా చేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతారని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గాల పునరి్వభజనతో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయన్నారు. సీట్లు పెరిగితే కొత్తవారికి పదవులు లభిస్తాయన్నారు. పదవుల్లో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు.


