‘చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరు’ | YSRCP MLC Arun Kumar Criticizes CM Chandrababu For Broken Promises And IT Policy Failures | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరు’

Mar 29 2026 5:16 PM | Updated on Mar 29 2026 6:45 PM

 MLC Arun slams CM Chandrababu

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అరుణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరని చెప్పారు.

‘పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందా? గతంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మళ్లీ ఎందుకు కలిశారు? చంద్రబాబు గతంలో ప్రధాని మోదీని ఏమన్నారో గుర్తు చేసుకోవాలి. ప్రధాని మోదీని చంద్రబాబు వ్యక్తిగతంగా విమర్శించారు. దేశ సంపదను మోదీ ఖూనీ చేస్తున్నారని, మోదీకి కుటుంబ విలువ తెలియదని కామెంట్ చేయలేదా?

ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు ఐటీకి చేసిన కృషి ఏంటో చెప్పగలరా? ఐటీకి షౌండేషన్ కూడా నేదురమల్లి జనార్దన్ వేశారు. చంద్రబాబు ఐటీకి పీతమహుడిలా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించరు.

టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్‌లో ఉన్నారు. టీడీపీపై పోటీ చేశారు. అవసరమైతే ఎన్టీఆర్‌ను ఓడిస్తానని, సినిమావాళ్లకు రాజకీయాలు ఎందుకు? అని మాట్లాడింది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కుంది చంద్రబాబే. పార్టీని, పార్టీ జెండాను, పార్టీ కార్యాలయాలను, పార్టీ అకౌంట్స్ ను లాక్కుంది చంద్రబాబే. ఎన్టీఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు.

ఆశయాలతో పెట్టిన ఎన్టీఆర్ పార్టీని వెన్నుపోటు పోడవడమే కాదు. పథకాలన్నీ తొలగించారు. పథకాలన్నీ కాపీనే కదా?  కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోంది. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. కానీ, ఎంత లెక్క వేసిన 40వేల ఉద్యోగాలే వస్తుంది. 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి’ అని అరుణ్‌కుమార్‌ విమర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement