విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టౌన్ కొత్తరోడ్డు సమీపంలో స్క్రాప్ షాప్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు ఎగిసి పడుతున్నాయి. దాని పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముందే వేసవికాలం కావడంతో మంటలు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు భావిస‍్తున్నారు.
కాగా, రెండు వారాల ముందే విశాఖ గోపాలపట్నంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. చంద్రనగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ఆ ఘటనను మరవకముందే ఇప్పుడు మళ్లీ విశాఖలోనే భారీ అగ్ని ప్రమాదం సంభవించడం గమనార్హం.


