
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ ముగిసింది. రాష్ట్రానికి రావాల్సిన సబ్సిడీ బియ్యం, ధాన్యం సేకరణ బకాయిలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. 'ఏడేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన సబ్సిడీ బియ్యం రావడం లేదు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.వందల కోట్ల అదనపు భారం పడుతోంది. ధాన్యం సేకరణ బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని కోరాం. తాను చర్చించిన అన్ని అంశాలపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు' అని తెలిపారు.