సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగుతాయి. నైతికత, మానవ విలువలు పరీక్ష ఆగస్టు 24న.. పర్యావరణ విద్య పరీక్ష ఆగస్టు 26న జరుగుతాయి. విద్యార్థులు నిర్ణీత ఫీజులను జులై 8లోపు చెల్లించాలని పేర్కొంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
