
CM Jagan Wishes PM Narendra Modi: ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంతో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలకు సుదీర్ఘ కాలం పాటు సేవలందించడానికి మోదీకి మరింత బలం చేకూరాలన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాల నేతల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
చదవండి: ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు: భారీ కేక్స్, ఆకట్టుకునే సైకత శిల్పం
Wishing Hon'ble Prime Minister Shri @narendramodi ji a very happy birthday. May almighty bless him with long life, good health & greater strength in the service of the nation.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2021